Sonia Gandhi: సోనియాగాంధీ నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసిన విపక్ష నేతలు
- విద్యార్థుల ఆందోళనలను రాష్ట్రపతికి వివరించిన నేతలు
- పోలీసుల వైఖరిపై ఫిర్యాదు
- సోనియా వెంట ఆజాద్, ఏచూరి తదితరులు
దేశంలో పలు ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నిరసనలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. యూనివర్సిటీల విద్యార్థులు సైతం రోడ్లపైకి రావడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షనేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు, పోలీసుల వైఖరిపై నేతలు రాష్ట్రపతికి వివరించారు. జామియా వర్సిటీలో విద్యార్థులపై పోలీసుల దాడిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. సోనియా వెంట రాష్ట్రపతిని కలిసినవారిలో గులాంనబీ ఆజాద్, సీతారాం ఏచూరి, డి.రాజా, డెరెక్ ఓబ్రెయిన్, రాంగోపాల్ యాదవ్ తదితరులున్నారు.