ke krishna myrty: కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను: కేఈ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు
- కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటి నుంచి కోరుకుంటున్నాను
- రాష్ట్ర విభజన సమయంలోనే ఈ డిమాండ్ చేశాను
- వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నిన్న సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 'న్యాయ రాజధానిగా కర్నూలు' అంటూ ఆయన చేసిన ప్రకటనను టీడీపీ కీలక నేత కేఈ కృష్ణమూర్తి సమర్థించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నూలులో హైకోర్టు ఏర్పాటు నిర్ణయాన్ని సమర్థిస్తున్నానని, ఈ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని తాను మొదటి నుంచి కోరుకుంటున్నానని అన్నారు.
రాష్ట్ర విభజన సమయంలోనే కర్నూలులో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటుకు డిమాండ్ చేశానని కేఈ కృష్ణమూర్తి అన్నారు. వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పాలనా రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు, చట్టసభల రాజధానిగా అమరావతి ఉండచ్చని జగన్ ప్రకటించారు.