saradpawar: బీజేపీకి ప్రత్యామ్నాయం అవసరం : సీనియర్ నేత శరద్ పవార్

  • దేశంలో కమలనాథులకు వ్యతిరేక పవనాలు 
  • ప్రజలు మార్పుకోసం ఎదురు చూస్తున్నారు 
  • అది భారత్ లోనే రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది

దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్ల రోజురోజుకీ తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారని సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో దేశంలో ఉండి అందరినీ ఏకతాటిపై నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి దీటైన ప్రత్యామ్నాయాన్ని రూపొందించాల్సి అవసరం ఉందన్నారు.

ఈ వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సీఏఏకు వ్యతిరేకంగా దేశంలో కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఆందోళనలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటించడాన్ని ఈ విధంగా శరద్ పవార్ తప్పుపట్టారని విశ్లేషకులు ఊహించుకుంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివ సేన, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న వేళ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

  • Loading...

More Telugu News