Arvind Kejriwal: దేశంలో శాంతి, భద్రతలు క్షీణించిపోతున్నాయి: కేజ్రీవాల్
- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు
- దేశ పౌరుల్లో భయం నెలకొంది
- ఇటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావద్దని నేను కోరుతున్నాను
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపడుతోన్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ కవాతుకు పిలుపునివ్వడంతో అక్కడకు చేరుకుంటోన్న వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు.
'దేశంలో శాంతి, భద్రతలు క్షీణించిపోతున్నాయి. దేశ పౌరుల్లో భయం నెలకొంది. ఇటువంటి చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావద్దని నేను కోరుతున్నాను. దేశ యువతకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్లాలి' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా, ఢిల్లీతో పాటు గురుగ్రామ్, ఛత్తీస్ గఢ్, కర్ణాటకల్లోనూ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి.