amaravathi: అమరావతిలో మూడో రోజూ కొనసాగుతున్న నిరసనలు.. రోడ్డుపై టైర్లు తగలబెట్టిన రైతులు
- ఉదయాన్నే రోడ్డుపైకి చేరిన మందడం రైతులు
- సీఎం ఫ్లెక్సీలు చించివేత
- పోలీసులు, రైతుల మధ్య వాగ్వివాదం.. ఉద్రిక్తత
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై ఆందోళన చేస్తున్న రైతులు.. జీఎన్ రావు కమిటీ నివేదికపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నేటి ఉదయం రోడ్లపైకి వచ్చిన మందడం రైతులు అడ్డంగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. గ్రామంలోకి ఎవరూ రాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుపై సిమెంటు బెంచీలు, కరెంట్ స్తంభాలు అడ్డం పెట్టారు. మరోవైపు రోడ్డుపై రైతులు టైర్లు తగలబెట్టారు. సీఎం ఫ్లెక్సీలను చించివేశారు.
దీంతో స్పందించిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందడంలో పోలీసులు భారీగా మోహరించారు.