amaravati: రైతుల ఆగ్రహం చూసి జీఎన్ రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయింది: దేవినేని ఉమ
- విశాఖలో 4 నెలలుగా వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారు
- కమర్షియల్ కాంప్లెక్స్ భూములను విజయసాయి రెడ్డి కాజేశారు
- వాల్తేరులో 13 ఎకరాల భూముల కబ్జాకు విజయసాయి రెడ్డి ప్రయత్నించారు
- ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలి
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కొనసాగుతోన్న గందరగోళంపై మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'అది జీఎన్ రావు కమిటీ కాదు జగన్ కమిటీ. రైతుల ఆగ్రహం చూసి జీఎన్ రావు కమిటీ దొడ్డిదారిన పారిపోయింది' అని విమర్శించారు.
'ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి అమరావతిని అభివృద్ధి చేయాలి. విశాఖపట్నంలో నాలుగు నెలలుగా వైసీపీ నేతలు భారీగా భూములు కొన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ భూములను విజయసాయి రెడ్డి కాజేశారు. వాల్తేరులో 13 ఎకరాల భూముల కబ్జాకు విజయసాయి రెడ్డి ప్రయత్నించారు' అని దేవినేని ఉమ ఆరోపణలు గుప్పించారు.
'మధురవాడ, భోగాపురంలో ఆరు వేల ఎకరాలు చేతులు మారుతున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరపాలి. ప్రభుత్వం మెడలు వంచైనా రాజధానిని కాపాడుకుంటాం' అని దేవినేని తెలిపారు.