Chandrababu: చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోంది: సీపీఐ నారాయణ

  • హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ  అభివృద్ధి చెందదు
  • సచివాలయం ఓ చోట, మంత్రుల నివాసాలు మరోచోటా!
  • విహారయాత్రకు వెళుతున్నట్టు ఉంటుంది

చంద్రబాబు విధానాలను వ్యతిరేకించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారని సీపీఐ నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసినంత మాత్రాన రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందదని, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు తోనే సాధ్యమని అన్నారు.

దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో సచివాలయాలు, హైకోర్టులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయని, అయితే, అసెంబ్లీ, సచివాలయం వేరే చోట్ల లేవని చెప్పారు. సచివాలయం ఒకచోట, మంత్రుల నివాసాలు మరోచోట ఉంటే విహారయాత్రకు వెళుతున్నట్టు ఉంటుందే తప్ప, పరిపాలనకు అనుకూలంగా ఉండదని సెటైర్లు విసిరారు. రాజధాని అమరావతి గురించి ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై అఖిలపక్షం నిర్వహించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News