Goa: పౌరసత్వ సవరణ చట్టానికి గోవా మద్దతు.. ఎన్నార్సీపై మాట్లాడేందుకు సీఎం విముఖత

  • సీఏఏ వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది లేదు
  • ఎన్సార్సీపై ఇప్పుడే స్పందించబోం
  • కేంద్రం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత చూద్దాం

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టంపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా మాట్లాడుతుండగా, గోవాలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఆమోదిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. ఈ చట్టం వల్ల గోవా ప్రజలకు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. అయితే, ఎన్నార్సీపై మాట్లాడేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. ఎన్సార్సీ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన వెలువడలేదని, వచ్చిన తర్వాత స్పందిస్తామని ప్రమోద్ సావంత్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News