Vijayashanthi: 'మీ ప్రొఫెసర్ భారతి' అంటూ ఫేస్ బుక్ లో విజయశాంతి పోస్ట్!
- ఆనాటి మహనీయుల పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం
- 'సరిలేరు' అనే పాట వారి త్యాగాలకు మరింత స్ఫూర్తివంతమైన నివాళి అన్న విజయశాంతి
- 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ప్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తున్న విజయశాంతి
కాంగ్రెస్ నాయకురాలు, ప్రముఖ సినీ నటి విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా స్ఫూర్తిదాయకమైన పోస్ట్ చేశారు. మహాత్మాగాంధీ, తిలక్, గోఖలే, ఝాన్సీ లక్ష్మీబాయ్, భగత్ సింగ్, ఆజాద్, అంబేద్కర్.... వీరితో పాటు చరిత్రకు అందని ఎందరో స్వతంత్ర పోరాట అమరవీరులు... ఆనాడు వారి ప్రాణాలొడ్డి ఐరోపా జాత్యహంకారానికి వ్యతిరేకంగా దురాక్రమణను ప్రతిఘటించిన ఫలితమే మన స్వాతంత్ర్యమని ఆమె చెప్పారు.
'సరిలేరు' అనే పాట విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటుతూ భారతీయ సైన్యానికి నివాళిగా ఇప్పుడు వస్తోందని విజయశాంతి తెలిపారు. యూరోపియన్ కళాకారులు తమ సౌజన్యంతో ఈ పాటకు ప్రాణంపోయడం ఆనాటి మహోన్నతుల త్యాగాలకు మరింత స్ఫూర్తివంతమైన నివాళి అని అన్నారు. వందేమాతరం... జై భారత్... మీ ప్రొఫెసర్ భారతి అంటూ ఆమె ముగించారు.
మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి ప్రొఫెసర్ భారతి పాత్రను పోషిస్తున్నారు. ఎంతోకాలం తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి.