Kerala: అయ్యప్ప దర్శనానికి వెళుతుంటే గుండెపోటు.. ఈ సీజన్ లో 19 మంది దీక్షాధారుల మృతి

  • ఈ సీజన్లో ఇదే అత్యధిక సంఖ్య 
  • నవంబరు 15 నుంచి ఇప్పటి వరకు మృతులు 
  • వీరిలో కొండ ఎక్కుతూ మృతి చెందింది 15 మంది

కేరళ రాష్ట్రం శబరిమల అలయంలో స్వామి దర్శనానికి వెళుతూ గుండెపోటు బారిన పడి ఈ సీజన్లో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందినట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. వీరిలో పంబా కొండను అధిరోహిస్తున్నప్పుడే 15 మంది చనిపోయారని తెలిపింది. 

ఏటా నవంబర్ నెలలో ప్రారంభమయ్యే అయ్యప్ప స్వామి దర్శనానికి అంతకుముందు నలభై ఒక్క రోజులు (మండలం) దీక్ష చేపట్టి  స్వాములు కొండకు వస్తారు. ఈ విధంగా నవంబరు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భక్తులలో 19 మంది చనిపోయారని తెలిపింది.

ఈ సీజన్లో శబరిమల నుంచి సన్నిధానం వరకు కేరళ ప్రభుత్వం 15 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఈ శిబిరాల్లో మొత్తం 30,157 మందికి వైద్య సహాయం అందించగా వీరిలో 414 మందికి అత్యవసర వైద్యం అందించినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. మండల పూజ సందర్భంగా రద్దీ కారణంగా చాలామంది అనారోగ్యం బారిన పడినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News