Perni Nani: రాజధాని ప్రాంతంలో అవినీతిపై సమగ్ర దర్యాప్తు కోసం న్యాయసలహా తీసుకుంటాం: పేర్ని నాని

  • ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం
  • మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పేర్ని నాని
  • మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడి

రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఉద్దేశించిన సీఆర్ డీఏ ప్రాజెక్టు పరిధిలో జరిగిన కుంభకోణాలు, అవినీతిపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించిందని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఆర్ డీఏ ప్రాజెక్టు పరిధిలో ప్రాథమికంగా అనేక తప్పులు జరిగినట్టు మంత్రి వర్గం ఉపసంఘం నివేదికలో పేర్కొన్నారని మంత్రి చెప్పారు. నైతిక విలువలు దిగజార్చే విధంగా, అప్పటి ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చేసిన తప్పులను మంత్రి వర్గ ఉపసంఘం కనుగొన్నదని వివరించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం న్యాయనిపుణుల సలహా తీసుకుని, ఆ మేరకు ముందుకు వెళతామని చెప్పారు.  

అంతేగాకుండా, మచిలీపట్నం పోర్టు, రామాయపట్నం పోర్టు గురించి కూడా మంత్రి మాట్లాడారు. మచిలీపట్నం పోర్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని, రామాయపట్నం పోర్టుకు అడ్డంకిగా ఉన్న కృష్ణపట్నం పోర్టు ముఖపరిధిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News