Galla Jayadev: ఏపీలో ఏ నగరమైనా అభివృద్ధి చెందిందంటే అది విశాఖనే: గల్లా జయదేవ్
- విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలి
- రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలి
- పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఖర్చులు పెరుగుతాయి
అవసరమైన వసతులన్నీ ఇప్పటికే ఉన్న చోటే రాజధాని ఉండాలని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రాజధానికి కావాల్సినవన్నీ అమరావతిలో ఇప్పటికే ఉన్నాయని చెప్పారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేయాలని అన్నారు. ఏ రాష్ట్ర అభివృద్ధిని అయినా మౌలిక వసతులు, పరిశ్రమలు, ఉపాధి కల్పన, అందుతున్న సేవలను బట్టి అంచనా వేయవచ్చని తెలిపారు. టీడీపీ పాలనలో అభివృద్ధిని వికేంద్రీకరించామని... అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా కృషి చేశామని చెప్పారు.
మన రాష్ట్రంలో అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందంటే అది విశాఖ మాత్రమేనని గల్లా జయదేవ్ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అత్యంత అభివృద్ధి చెందిన రెండో నగరంగా విశాఖ ఉండేదని చెప్పారు. వైజాగ్ ను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరగదని... పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. దీనివల్ల ఖర్చులు పెరగడం మినహా ఉపయోగం లేదని.... ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ఇది మరింత భారంగా మారుతుందని చెప్పారు.