Atreya: ఆత్రేయపై మండిపడిన దర్శకుడు పి.పుల్లయ్య
- ఆత్రేయ ఒక పట్టాన రాసేవారు కాదు
- ఆలస్యం చేయడానికి అదే కారణం
- ఆ పాట పల్లవి అలా మొదలైందన్న ఈశ్వర్
ఆత్రేయ పాటలు మాత్రమే కాదు .. మాటలు రాసిన సినిమాలు కూడా వున్నాయి. సంభాషణలను అందించే విషయంలోను ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారు. అలాంటి ఆత్రేయ గురించి సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ స్పందించారు.
"ఆత్రేయగారు చివరి నిమిషం వరకూ పాట రాయడనే టాక్ అప్పట్లో ఇండస్ట్రీలో ఉండేది. ముందుగానే పాట రాస్తే కరెక్షన్లు చెబుతూనే ఉంటారని ఆయన చివరి నిమిషం వరకూ రాసేవారు కాదు. పి.పుల్లయ్య గారు .. ఆత్రేయగారు మంచి స్నేహితులు. 'మురళీకృష్ణ' సినిమా కోసం పాట రాయమంటే ఆత్రేయ ఎంతకీ రాయకపోవడంతో, పుల్లయ్యగారికి కోపం వచ్చేసింది. దాంతో ఆయన 'నేను వేరే వాళ్లతో రాయించుకుంటాను' అంటూ తిట్టేసి వెళ్లిపోతూ 'నువ్వెక్కడున్నా బాగుండాలి ... నీ సుఖాన్నే నేను కోరుకుంటున్నాను' అనేసి అక్కడి నుంచి కదిలాడట. దాంతో ఆత్రేయ గారు పల్లవి దొరికేసింది అంటూ 'నీ సుఖమే నే కోరుకున్నా' అంటూ అప్పటికప్పుడు పాట రాసేసి ఇచ్చారట. ఆ పాట ఎంత పాప్యులర్ అయిందో తెలిసిందే" అని చెప్పుకొచ్చారు.