NRC: ఎన్ఆర్సీపై కేంద్రమంత్రి రవిశకంర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
- ఎన్ఆర్సీ విషయంలో రహస్యం ఏమీ లేదు
- రాష్ట్రాల అభిప్రాయాలను కూడా తీసుకుంటాం
- అప్పీలు చేసుకునే హక్కు ఉంటుంది
జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) విషయంలో గుడ్డిగా ముందుకు వెళ్లబోమని, ఓ ప్రక్రియ ప్రకారం ముందుకు వెళ్తామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్ఆర్సీ విషయంలో రహస్యం ఏమీ లేదని, ఈ విషయంలో రాష్ట్రాలను తొలుత సంప్రదిస్తామని పేర్కొన్నారు. అంతా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందని పేర్కొన్నారు.
తొలుత నిర్ణయం తీసుకుని, ఆపై నోటిఫికేషన్ ఇస్తామని, ఆ తర్వాత ప్రక్రియ ప్రారంభించి అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తామని అన్నారు. వాటిని విచారించిన తర్వాత అప్పీలు చేసుకునే హక్కు కూడా ఉంటుందని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాష్ట్రాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.