Narendra Modi: సీఏఏకు మద్దతుగా సోషల్ మీడియాలో ఉద్యమం ప్రారంభించిన ప్రధాని మోదీ
- భారత్ కు వచ్చిన శరణార్థులకు పౌరసత్వం
- ఇక్కడి వారి పౌరసత్వాన్ని తీసేయడం లేదు
- #IndiaSupportsCAA హ్యాష్ ట్యాగ్ తో మద్దతు తెలపండి
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సోషల్ మీడియాలో ఈ బిల్లుకు మద్దతుగా ఉద్యమాన్ని ప్రారంభించారు. 'వివక్షకు గురవుతూ భారత్ కు వచ్చిన శరణార్థులకు సీఏఏ చట్టం ప్రకారం పౌరసత్వం ఇస్తాం. అంతేగానీ, ఎవరి పౌరసత్వాన్నీ తీసేయడం లేదు' అని ఆయన నరేంద్ర మోదీ.ఇన్ లో పేర్కొన్నారు.
#IndiaSupportsCAA హ్యాష్ ట్యాగ్ తో ప్రజలు ఈ చట్టానికి మద్దతు తెలపాలని మోదీ కోరారు. ప్రజలకు ఈ చట్టంపై ఉన్న అభిప్రాయాలను షేర్ చేయాలని ఆయన చెప్పారు. ఆయన ఈ హ్యాష్ టాగ్ ప్రారంభించిన కొద్దిసేపటికే వేలాది మంది ట్వీట్లు చేశారు.