Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ!

  • నిన్న ఖాళీగా కనిపించిన తిరుమల
  • నేడు సాధారణ స్థాయికి రద్దీ
  • దర్శనానికి 6 గంటల సమయం

గురువారం ఖాళీగా కనిపించిన తిరుమల నేడు కాస్తంత రద్దీగా కనిపించింది. ఈ ఉదయం భక్తుల రద్దీ సాధారణ స్థాయికి చేరింది. స్వామివారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. వీరికి స్వామి దర్శనానికి ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. ఇక రూ. 300 ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్ల దర్శనం, నడక దారి భక్తుల దివ్య దర్శనానికి మూడు గంటల వరకూ సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 60,328 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజుల్లో వైకుంఠ ఏకాదశి రద్దీ మొదలవుతుందని, ఈలోగా మాఢవీధుల్లో తాత్కాలిక షెడ్ల నిర్మాణం, భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News