Nara Lokesh: విద్యార్థులను చీకటి గదిలో బంధిస్తారా... వాళ్లేమైనా ఉగ్రవాదులా?: నారా లోకేశ్
- ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం విద్యార్థుల ఆందోళన
- లాఠీచార్జి చేశారంటూ మండిపడిన లోకేశ్
- వెంటనే బకాయిలు విడుదల చేయాలంటూ డిమాండ్
'అన్నా, మాట మీద నిలబడు' అన్నందుకు విద్యార్థులపై లాఠీచార్జి చేయించారంటూ వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామంటూ పాదయాత్రలో విద్యార్థులకు మాటిచ్చారని, కానీ అధికారం చేపట్టిన తర్వాత పేద విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం అడుగుతున్న విద్యార్థులను చీకటి గదిలో బంధించడం ఏంటని లోకేశ్ ప్రశ్నించారు. విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం దారుణమని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ సర్కారు ఇప్పటికైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.