Har Gobind Khorana: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త హర్గోవింద్ ఖొరానాకు పాక్ అరుదైన గౌరవం
- ఖొరానా పేరిట లాహోర్‌లో ప్రత్యేక పరిశోధన విభాగం
- ఖొరానా జన్మించిన ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లో
- వైద్య రంగంలో 1968లో నోబెల్ పురస్కారం
భారతీయ అమెరికన్ అయిన ప్రఖ్యాత శాస్త్రవేత్త హర్గోవింద్ ఖొరానా పేరిట పాకిస్థాన్‌లో ప్రత్యేక పరిశోధన విభాగం ఏర్పాటు కానుంది. లాహోర్‌లోని ప్రభుత్వ కాలేజీ యూనివర్సిటీ (జేసీయూ)లో దీనిని ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం నిన్న ప్రకటించింది. దీంతో ఓ భారతీయ అమెరికన్ అయిన ఖొరానాకు పాకిస్థాన్‌లో అరుదైన గౌరవం లభించినట్టు అయింది. వైద్య రంగంలో 1968లో నోబెల్ బహుమతి అందుకున్న ఖొరానా.. 1922లో రాయ్‌పూర్‌లో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో ఉంది. ఖొరానా 9 నవంబరు 2011న అమెరికాలోని మసాచుసెట్స్‌లో కన్నుమూశారు.