Tulluru: పోలీసులు తమను ఏవిధంగా హింసించిందీ జాతీయ మహిళా కమిషన్ కు వివరించిన తుళ్లూరు మహిళలు

  • తీవ్ర ఉద్రిక్తతల నడుమ రాజధాని ఉద్యమం
  • తుళ్లూరులో పోలీసు చర్య
  • రాష్ట్రానికి వచ్చిన మహిళా కమిషన్

ఏపీ రాజధాని అమరావతిని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఉద్యమం క్రమంగా హింసాత్మక రూపు దాల్చుతోంది. ఉద్యమకారులపై పోలీసులు విరుచుకుపడుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. తుళ్లూరులో మహిళలపై జరిగిన పోలీసు దాడి తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో, తుళ్లూరు గ్రామ మహిళలపై పోలీసు చర్య పట్ల సుమోటోగా స్పందించిన జాతీయ మహిళా  కమిషన్ ఏపీకి కదిలివచ్చింది. తుళ్లూరులో అసలేం జరిగిందన్న అంశం నిగ్గుతేల్చేందుకు మహిళా కమిషన్ నిజ నిర్ధారణ కమిటీ రంగంలోకి దిగింది.

ఈ క్రమంలో తుళ్లూరు వచ్చిన కమిటీ సభ్యులు ప్రవీణ్ సింగ్, కాంచన కట్టర్ తదితరులు తొలుత మహిళలపై దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆపై తుళ్లూరు చేరుకుని డీఎస్పీతోనూ, తహసీల్దార్ తోనూ మాట్లాడారు. ఈ సందర్భంగా తుళ్లూరు మహిళలు  కమిషన్ సభ్యులతో మాట్లాడుతూ తమపై పోలీసులు ఏ విధంగా దాడి చేసిందీ వివరించారు. అంతేకాదు, కొందరు వీడియో సాక్ష్యాలను కూడా కమిషన్ ముందుంచారు. కాగా, ఈ పర్యటనలో జాతీయ మహిళా కమిషన్ సభ్యుల వెంట టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News