India: ఎన్నికష్టాలు వచ్చినా గమ్యం చేరే వరకూ ఆత్మవిశ్వాసం వీడొద్దు: గవర్నర్ బండారు దత్తాత్రేయ
- కేశవ మెమోరియల్ స్వామి వివేకానంద 158వ జయంతి కార్యక్రమాలు
- భారత్ యువశక్తిగా ఎదుగుతోంది
- 2030 వరకూ ప్రపంచ దేశాల్లో భారత యువతే ఎక్కువగా ఉంటుంది
జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గమ్యం చేరే వరకూ ఆత్మవిశ్వాసం వీడొద్దని యువతకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపు నిచ్చారు. హైదరాబాద్, నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజ్ లో స్వామి వివేకానంద 158వ జయంతి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ, భారత్ యువశక్తిగా ఎదుగుతోందని, 2030 వరకూ ప్రపంచ దేశాల్లో భారత యువతే ఎక్కువగా ఉంటుందని అన్నారు. స్వామి వివేకానందను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.