Mandadam: మందడంలో మహిళలను ఫొటోలు తీస్తున్నాడంటూ వ్యక్తిని రౌండప్ చేసిన రైతులు
- మందడంలో రైతులు, మహిళల నిరసనలు
- మహిళల్ని ఫొటో తీసిన వ్యక్తి
- అడ్డుకున్న రైతులు
- పోలీసులు సర్దిచెప్పడంతో శాంతించిన రైతులు
అమరావతి ఉద్యమంలో భాగంగా మందడంలో రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ టెంట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహిళలు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఫొటోలు తీయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ వ్యక్తిని చుట్టుముట్టారు. అయితే తాను ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చానని ఆ వ్యక్తి చెప్పడంతో ఐడీ కార్డు ఏదని రైతులు నిలదీశారు. ఆ వ్యక్తి ఐడీ కార్డు చూపించకపోవడంతో రైతులు ఆగ్రహం ప్రదర్శించారు. అతడిని అక్కడ్నించి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి అతడు ఇంటెలిజెన్స్ విభాగానికి చెందినవాడని చెప్పడంతో రైతులు శాంతించారు.