Amaravati: ముగిసిన హైపవర్ కమిటీ భేటీ.. 17న మరోసారి సమావేశం!

  • రాజధానిపై ప్రభుత్వ ప్రతిపాదనలపై చర్చ 
  • రాజధాని రైతుల ఆందోళన, ఉద్యోగుల అంశం పై గత సమావేశాల్లో... 
  • రైతుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించాలని నిర్ణయం

రాజధాని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్ కమిటీ ముచ్చటగా మూడోసారి సమావేశమైనా ఏమీ తేల్చకుండానే ముగించింది. సంక్రాంతి అనంతరం ఈ నెల 17న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. 

విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి లిఖిత పూర్వకంగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ విజ్ఞాపనలను రైతులు నేరుగా సీఆర్డీఏ కమిషనర్ కు  అందించినా పర్వాలేదని, ఆన్ లైన్లో ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. 

కాగా, ఈ భేటీలో రాజధాని అంశంపై ప్రభుత్వం చేయనున్న ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. ఇంతకు ముందు జరిగిన రెండు సమావేశాల్లో రైతుల ఆందోళన, సచివాలయం ఉద్యోగుల డిమాండ్ల పై చర్చించారు.

  • Loading...

More Telugu News