Microsoft: సీఏఏపై అమెరికన్ జర్నలిస్ట్ ప్రశ్న.. స్పష్టత లేకుండా సమాధానం ఇచ్చిన సత్య నాదెళ్ల

  • పౌరసత్వ సవరణ చట్టంపై తొలిసారి స్పందించిన మైక్రోసాఫ్ట్ సీఈవో
  • ప్రస్తుతం జరుగుతున్నది విచారకరమన్న నాదెళ్ల
  • భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ సీఈవో కావాలని ఆకాంక్ష

నరేంద్రమోదీ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తొలిసారి స్పందించారు. అయితే, ఆయన చట్టంపై స్పందించారా, లేక, సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలపై స్పందించారా? అన్న విషయంలో స్పష్టత లేదు.

సీఏఏపై అమెరికన్ జర్నలిస్ట్ ఒకరు అడిగిన ప్రశ్నకు సత్య నాదెళ్ల బదులిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్నది విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచిది కాదన్నారు. అయితే, భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ వలసదారుడు ఇన్ఫోసిస్ తదుపరి సీఈవో అయితే చూడాలని ఉందని పేర్కొన్నారు. ఆ సమాధానంలో స్పష్టత లేకున్నా.. చట్టబద్ధమైన వలస విధానం వల్ల జరిగే మంచి గురించే ఆయన మాట్లాడి ఉంటారని విశ్లేషిస్తున్నారు.

  • Loading...

More Telugu News