Jammu And Kashmir: కశ్మీర్ లో పంజా విసిరిన 'అవలాంచే'... ముగ్గురు జవాన్లు బలి

  • జమ్మూకశ్మీర్ లో అనేక ప్రాంతాల్లో హిమపాతం
  • మంచు తుపాను ప్రభావానికి గురైన ఆర్మీ క్యాంప్  
  • జనావాసాలపైనా ప్రభావం
జమ్మూకశ్మీర్ లో మంచు తుపాను (అవలాంచే) ముగ్గురు జవాన్లను బలిగొంది. ఉత్తర కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో గత రెండ్రోజులుగా హిమపాతాలు సంభవిస్తున్నాయి. తాజాగా సైనిక శిబిరంపై మంచు తుపాను పంజా విసిరింది. ఈ తుపాను ధాటికి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో సైనికుడు గల్లంతయ్యాడు. అటు, సోన్ మార్గ్ లో సంభవించిన మంచు తుపాను ఐదుగురు సాధారణ పౌరుల ప్రాణాలు హరించింది. అయితే, హిమపాతంలో చిక్కుకున్న తొమ్మిదిమంది సాధారణ పౌరులను సైన్యం రక్షించడంతో మరింత ప్రాణనష్టం తప్పింది.
Jammu And Kashmir
Snow
Avalanche
Army
Soldiers

More Telugu News