Noah Kalina: 20 ఏళ్లుగా ప్రతి రోజు సెల్ఫీ తీసుకుంటున్న వ్యక్తి... వీడియో చూడండి!
- న్యూయార్క్ ఫొటోగ్రాఫర్ సుదీర్ఘ సెల్ఫీ ప్రస్థానం
- 2000 నుంచి ఇప్పటివరకు ప్రతి రోజు సెల్ఫీ
- ఓ వీడియోలో తన సెల్ఫీలు రికార్డు చేసిన ఫొటోగ్రాఫర్
ఇప్పుడు నెట్ యుగంలో ఉన్నాం. సెల్ఫీ అనే మాట సర్వసాధారణమైపోయింది. అయితే 20 ఏళ్ల కిందట సెల్ఫీ అనే పదం ఎవరికీ తెలియని రోజుల్లోనే నోవా కలినా అనే ఓ ఫొటోగ్రాఫర్ తన స్వీయచిత్రాలను సెల్ఫీ పోర్ట్రెయిట్ అని పిలుచుకునేవాడు. గత 20 ఏళ్లుగా ప్రతిరోజు ఓ సెల్ఫీ దిగడం అతని హాబీ. సెల్ఫీ కోసం తన కెమెరాకు ఫ్లిప్ వ్యూఫైండర్ అనుసంధానం చేసి తనను తాను చూసుకుని క్లిక్ మనిపించేవాడు.
న్యూయార్క్ కు చెందిన నోవా కలినా 2000 జనవరి 11న తన సెల్ఫీ ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పటివరకు అప్రతిహతంగా 7263 సెల్ఫీలు దిగాడు. వాటిలో కొన్ని కంప్యూటర్ తప్పిదం కారణంగా మిస్సయినా వాటి సంఖ్య వేళ్లమీద లెక్కించవచ్చు. మొత్తం 7305 రోజుల్లో సెల్ఫీ దిగని రోజులు 27 మాత్రమే. ఇప్పుడు తన సెల్ఫీ ప్రయాణాన్ని 8 నిమిషాల వీడియోలో పొందుపరిచాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.