Salt: తీపితోనే కాదు.. ఉప్పుతోనూ మధుమేహ ముప్పు.. తస్మాత్ జాగ్రత్త!

  • శరీరంలోని ఇన్సులిన్‌ను నిరోధిస్తున్న సోడియం
  • రోజుకు 1.25 చెమ్చాల కంటే ఎక్కువ తింటే మధుమేహ ముప్పు
  • తాజా అధ్యయనంలో వెల్లడి

సాధారణంగా తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగి మధుమేహం వస్తుందనేది ఇప్పటి వరకు ఉన్న నమ్మకం. అయితే, ఇప్పుడా జాబితాలోకి ఉప్పు కూడా వచ్చి చేరింది. అదేంటి?.. ఉప్పు తింటే వచ్చేది రక్తపోటు (బీపీ) కదా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు ఆశ్చర్యపోవడంలో తప్పులేదు కానీ.. ఉప్పు వల్ల కూడా మధుమేహం బారినపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.

ఉప్పు ద్వారా లభించే సోడియంను తక్కువ మొత్తంలో తీసుకునేవారితో పోలిస్తే, రోజుకు సుమారు 2,800 మిల్లీ గ్రాములు (1.25 చెమ్చాలు), అంతకంటే ఎక్కువ తీసుకునేవారిలో మధుమేహం వచ్చే అవకాశం 72 శాతం ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనకారులు తేల్చారు. ఉప్పు ద్వారా శరీరంలోకి చేరే సోడియం ఇన్సులిన్‌ను నిరోధిస్తోందని, ఇది డయాబెటిస్‌కు దారి తీస్తుందని పేర్కొన్నారు.

ఉప్పును మోతాదుకు మించి తీసుకోవడం వల్ల రక్తపోటుకు గురికావడంతోపాటు బరువు కూడా పెరుగుతారని, మధుమేహానికి ఇవి రెండూ శత్రువులేనని వివరించారు. కాబట్టి ఉప్పు కూడా ముప్పు చేస్తుందని, కాబట్టి వీలైనంతగా దానికి దూరంగా ఉండాలని సూచించారు. ఏ రకంగానూ రోజుకు 2300 మిల్లీ గ్రాములకు మించి శరీరంలోకి ఉప్పు చేరకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News