Telangana: ఈ యాప్ తో దొంగ ఓట్లకు చెక్ పెట్టొచ్చు... తెలంగాణలో ప్రయోగాత్మకంగా అమలు!
- కొత్తగా ఫేస్ రికగ్నిషన్ యాప్
- 10 పోలింగ్ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు
- యాప్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారి
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఓ ఘనతర ప్రక్రియ. ముఖ్యంగా దొంగ ఓట్లను నివారించడం కొన్ని సందర్భాల్లో కత్తిమీద సాములా పరిణమిస్తుంది. ఇలాంటి సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ అధికారులు ఓ యాప్ తీసుకువచ్చారు. ఇది ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేస్తుంది. దొంగ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని ఇట్టే పట్టేస్తుందని తెలంగాణ ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ప్రయోగాత్మకంగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నారు. మొదట కొంపల్లి పురపాలక సంఘం పరిధిలోని పది పోలింగ్ కేంద్రాల్లో ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ తో ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ యాప్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తున్నారు.