crda: రైతులు తమ అభిప్రాయాలు తెలపొచ్చు: మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన
- సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం సవరించాం
- సీఆర్‌డీఏ ఈ-మెయిల్, వెబ్‌సైట్ పనిచేస్తోంది
- రైతులు తమ సూచనలు, సలహాలు చెప్పవచ్చు
సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం సవరించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. రైతులు తమ అభిప్రాయాలు తెలపొచ్చని ఆయన చెప్పారు. రైతులు అభ్యంతరాలు తెలపాల్సిన సీఆర్‌డీఏ ఈ-మెయిల్, వెబ్‌సైట్ పనిచేస్తోందని ఆయన అన్నారు. రైతులు తమ అభిప్రాయలు, సూచనలు, సలహాలు చెప్పవచ్చని తెలిపారు.
కాగా, హైపవర్ కమిటీకి తమ అభ్యంతరాలు తెలిపేందుకు రైతులు కార్యాచరణ ప్రణాళిక వేసుకున్నారు. ప్రత్యేకంగా లేఖలు సిద్ధం చేసి సీఆర్‌డీఏ అధికారులకు అందించేలా చర్యలు తీసుకున్నారు. అసైన్డ్ రైతులు, ఇతర రైతుల నుంచి సేకరించిన లేఖలను వేర్వేరుగా, నేరుగా సీఆర్‌డీఏ అధికారులకు అందించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది.