Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 13 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 3 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, మెటల్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్ సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడంతో, ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 13 పాయింట్లు లాభపడి 41,945కి పెరిగింది. నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 12,352 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (5.42%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.84%), సన్ ఫార్మా (1.24%), మారుతి సుజుకి (1.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.09%).
టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.57%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.16%), ఎల్ అండ్ టీ (-1.10%), టీసీఎస్ (0.78%).