Harish Rao: ఆ పనులు పూర్తి చేయించే బాధ్యత నాదే: హరీశ్ రావు
- ఈ ఏడాదిలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు
- కాళేశ్వరం నీళ్లు మూడు లేక నాలుగు నెలల్లో వస్తాయి
- గోదావరి జలాలతో సింగూరు దాహార్తి తీర్చుతాం
- సంగారెడ్డిని దత్తత తీసుకుని అన్ని వార్డులు తిరుగుతా
ఈ ఏడాదిలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదేనని, కాళేశ్వరం నీళ్లు మూడు లేక నాలుగు నెలల్లో వస్తాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గోదావరి జలాలతో సింగూరు దాహార్తి తీర్చుతామని చెప్పారు.
సంగారెడ్డిలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పారు. సంగారెడ్డిలో మంచినీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. సంగారెడ్డిని దత్తత తీసుకుని అన్ని వార్డులు తిరుగుతానని, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామని చెప్పారు.