Jammu And Kashmir: కశ్మీరీలు ఇంటర్నెట్ వాడేది అశ్లీల చిత్రాలు చూసేందుకే : నీతి అయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు
- నెట్ సేవలు నిలిపి వేయడంతో ఎటువంటి ఆర్థిక నష్టం లేదు
- వదంతులు వ్యాప్తికాకూడదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది
- నిరసనలకు ఆస్కారం లేకుండా పోయింది
నీతి అయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ వి.కె.సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు ఇంటర్నెట్ ను వినియోగించేది బూతు సినిమాలు చూడడానికి తప్ప మరొకదానికి కాదని, ఈ పరిస్థితుల్లో నెట్ సేవలు నిలిపివేయడం వల్ల ఆర్థికంగా వచ్చే నష్టం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, వదంతులు వ్యాప్తి చెందకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ కూడా ఢిల్లీ లాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే వారని ఆరోపించారు.