Yanamala: దాన్ని ఆర్థిక బిల్లుగా తీసుకురావడం సరికాదు: టీడీపీ నేత యనమల రామకృష్ణుడు
- అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు
- రాజధాని మార్పునకు ఒప్పుకోం
- ఆర్థిక బిల్లు కిందకు రాదు.. సీఆర్డీఏ అనేది ప్రత్యేక చట్టం
రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో సీఆర్డీఏ చట్ట సవరణ బిల్లుతో పాటు ఇంగ్లిషు మీడియం తప్పనిసరి, ఎస్సీ వర్గీకరణ బిల్లులను కూడా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించారు.
ఈ రోజు యనమల మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ఏపీ రాజధాని మార్పునకు మాత్రం ఒప్పుకోబోమని ఆయన అన్నారు. సీఆర్డీఏను ఆర్థిక బిల్లుగా వస్తుండడం సరికాదని ఆయన విమర్శించారు. ఇది ఆర్థిక బిల్లు కిందకు రాదని, సీఆర్డీఏ అనేది ప్రత్యేక చట్టమని ఆయన చెప్పారు.