Ukrain: ఉక్రెయిన్ విమానాన్ని కూల్చింది ఒకటి కాదు... రెండు మిసైల్స్: ఇరాన్
- విమానాన్ని తాకిన టార్ ఎం-1 మిసైల్స్
- బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసే టెక్నాలజీ లేదు
- అమెరికా సాయం కోరామన్న ఇరాన్
ఉక్రెయిన్ కు చెందిన విమానాన్ని ఈ నెల 8న తామే పొరపాటున కూల్చి వేసినట్టు అంగీకరించిన ఇరాన్, మరిన్ని వివరణలు ఇచ్చింది. తమ సైన్యం ప్రయోగించిన రెండు క్షిపణులు ఆ విమానాన్ని తాకాయని, టెహ్రాన్ నుంచి బయలుదేరిన కాసేపటికే, శివార్లలో అది కూలిపోయిందని తెలిపింది.
'టార్ ఎం-1' రకం మిసైల్స్ ను తమ సైన్యమే ప్రయోగించిందని తెలిపింది. ఇక విమానంలోని బ్లాక్ బాక్స్ లను డీకోడ్ చేసేంత టెక్నాలజీ తమ వద్ద లేదని, దీనికోసం అమెరికా, ఫ్రాన్స్‌ల సాయం కోరామని ఇరాన్ పౌర విమానయాన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ దేశాల నుంచి సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. కాగా, టార్ ఎం-1 మిసైల్స్ ను భూమిపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించేందుకు సోవియట్ యూనియన్ తయారు చేసింది. వీటిని గతంలోనే ఇరాన్ కొనుగోలు చేసింది.