mlc: సభలో నిజాలు మాట్లాడుతుంటే మంత్రులు దాడికి వచ్చారు: ఎమ్మెల్సీ సంధ్యారాణి
- సహచర సభ్యులంతా కవచంలా నిలబడి వారిని నియంత్రించారు
- మహిళలపై పోలీసుల తీరును ప్రశ్నిస్తే అందులో తప్పేముంది?
- బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తాం
శాసన మండలిలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. సభలో నిజాలు మాట్లాడుతుంటే మంత్రులు దాడికి వచ్చారని ఎమ్మెల్సీ సంధ్యారాణి మీడియాకు తెలిపారు. సహచర సభ్యులంతా కవచంలా నిలబడి వారిని నియంత్రించారని వివరించారు. మహిళలపై పోలీసుల తీరును ప్రశ్నిస్తే అందులో తప్పేముంది? అని ఆమె ప్రశ్నించారు. బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని చెప్పారు.
ఏ రాష్ట్రంలో కూడా సీఎం ఇంటి ముందు 144 సెక్షన్ ఉండదని, ఏపీ సీఎం ఇంటి ముందు మాత్రం ఆ సెక్షన్ విధించారని ఆమె అన్నారు. అమరావతి రైతుల విషయంలో బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. మహిళా సభ్యురాలి పట్ల నిన్న మంత్రుల ప్రవర్తన బాధాకరమని ఎమ్మెల్సీ రాజనరసింహులు అన్నారు. బిల్లును అడ్డుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని టీడీపీ సభ్యులు చెప్పారు.