Sensex: వరుసగా మూడో రోజు పతనమైన మార్కెట్లు
- 208 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 62 పాయింట్లు పతనమైన నిఫ్టీ
- 5 శాతానికి పైగా నష్టపోయిన ఓఎన్జీసీ
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. వరసగా మూడో రోజు మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఆటో, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 208 పాయింట్లు నష్టపోయి 41,115కి పడిపోయింది. నిఫ్టీ 62 పాయింట్లు కోల్పోయి 12,106కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (1.86%), టీసీఎస్ (1.78%), ఇన్ఫోసిస్ (1.06%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.02%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.78%).
టాప్ లూజర్స్:
ఓఎన్జీసీ (-5.13%), ఎన్టీపీసీ (-4.27%), మారుతి సుజుకి (-2.28%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.09%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.92%).