KTR: ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆకట్టుకుంటున్న కేటీఆర్!

  • రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల్లో ఆయన ఒక్కరే 
  • ఇదో అరుదైన గౌరవం అంటున్న పరిశీలకులు 
  • ప్రత్యేక బ్యాడ్జి అందించిన ఎకనామిక్ ఫోరం

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ తళుక్కుమంటున్నారు. ఇన్ఫార్మల్ గేదరింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడుగా కేటీఆర్ హాజరైన విషయం తెలిసిందే. ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జి అందించింది.

ఈ సదస్సుకు హాజరైన కేటీఆర్ పలు దేశాల ప్రతినిధులతో సమావేశమై తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర, యూట్యూబ్ సీఈఓ సుసాన్ వొజిక్కి, కోకో కోలా సీఈఓ జేమ్స్ క్వెన్సి వంటి ప్రముఖులతో కేటీఆర్ భేటీ అయి తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

  • Loading...

More Telugu News