CPI Ramakrishna: అంతమాత్రానికే మండలిని రద్దు చేసేస్తారా?: సీపీఐ రామకృష్ణ

  •  రాజధాని బిల్లును మండలి తిరస్కరించ లేదు.
  • మీ సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దడం భావ్యమా
  • అలాగనుకుంటే ఇడుపులపాయ నుంచి పాలన చేయండి

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన రాజధాని విభజన బిల్లును శాసన మండలి తిరస్కరించలేదని, కేవలం సెలెక్ట్‌ కమిటీకి పంపిందని, అంతమాత్రానికి మండలిని రద్దు చేస్తామని అనడం ముఖ్యమంత్రి జగన్‌కు తగదని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. అసెంబ్లీలో రాజధాని తీర్మానం నిబంధనలకు విరుద్ధమని, మండలిలో మాట చెల్లుబాటు కాలేదని దాన్నే రద్దు చేస్తామంటున్నారని విమర్శించారు.

జగన్‌ తన సొంత నిర్ణయాలను ప్రజలపై రుద్దుతూ లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాజధాని అన్నది రాజ్యాంగంలో లేనప్పుడు మూడు రాజధానులు ఎందుకని, అటువంటప్పుడు ఇడుపులపాయ నుంచే పాలన సాగించవచ్చుకదా అని సూచించారు. ఏపీ పేద రాష్ట్రం అయితే రైతులకు వ్యతిరేకంగా వాదించేందుకు రూ.5 కోట్లు ఇచ్చి న్యాయవాదిని ఎందుకు నియమించారని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News