tax: పన్ను ఎగవేస్తే సామాజిక అన్యాయం చేసినట్లే: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే
- ఐటీ అప్పిలేట్ ట్రైబ్యునల్ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడిన బాబ్డే
- ఏకపక్షంగా విపరీతంగా పన్నులు వేసే తీరు కూడా అన్యాయం
- పౌరులపై అధిక పన్నుల భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి
పన్ను ఎగవేస్తే సామాజిక అన్యాయం చేసినట్లేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే అన్నారు. ఢిల్లీలో ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఏకపక్షంగా విపరీతంగా పన్నులు వేసే తీరు అన్యాయమని అభిప్రాయపడ్డారు.
దేశ పౌరులపై అధిక పన్నుల భారాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. అధిక పన్నులు వేస్తే కూడా సామాజిక అన్యాయం చేసినట్లేనని అన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, కృత్రిమ మేధస్సును న్యాయ వ్యవస్థలోనూ వినియోగించాల్సి ఉందని జస్టిస్ బాబ్డే చెప్పారు.