TRS: తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు?.. సీపీఎస్‌ సర్వే వివరాలు ఇవిగో!

  • 120 మున్సిపాలిటీల్లో 104-109 మధ్య స్థానాలు టీఆర్‌ఎస్‌కి
  • ఎంఐఎంకు 1 లేదా 2 స్థానాలు దక్కే అవకాశం
  • కాంగ్రెస్‌ పార్టీకి 0-4 మధ్య సీట్లు
  • బీజేపీకి 0-2 మధ్య స్థానాలు

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయన్న ఆసక్తి తెలంగాణ ప్రజలలందరిలోనూ ఉంది. ఈ ఎన్నికల్లో జననాడిపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) సర్వే చేసి, ఫలితాలను వెల్లడించింది. 120 మున్సిపాలిటీల్లో 104-109 మధ్య స్థానాలు టీఆర్‌ఎస్‌కి దక్కుతాయని తెలిపింది. ఎంఐఎంకు 1 లేదా 2 స్థానాలు దక్కే అవకాశం ఉందని తెలిపింది.

కాంగ్రెస్‌ పార్టీకి 0-4 మధ్య సీట్లు దక్కుతాయని, బీజేపీకి 0-2 మధ్య స్థానాలు దక్కుతాయని సీపీఎస్ చెప్పింది. 7-10 మున్సిపాలిటీల్లో పోటీ అధికంగా ఉందని చెప్పింది. కాగా, టీఆర్‌ఎస్ పార్టీ 9 లేదా 10 మున్సిపల్‌ కార్పొరేషన్లు గెలిచే అవకాశముందని, ఒక స్థానాన్ని బీజేపీ గెలుచుకోవచ్చని పేర్కొంది.

  • Loading...

More Telugu News