TRS: ఛైర్మన్‌ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత.. ప్రమాణ పత్రాలు చించేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి.. అరెస్టు

  • మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వివాదం 
  • ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని దాడి 
  • కేసీఆర్‌పై మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌, సీపీఎం మధ్య పొత్తు కుదిరినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వారిని ఆయన అడ్డుకున్నారు. అలాగే, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని, ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో లాఠీచార్జ్‌ జరిగింది.

  • Loading...

More Telugu News