Amaravati: రాజధాని కోసం.. కృష్ణానదిలో దిగి రైతుల వినూత్న నిరసన
- అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ జలదీక్ష
- తమ హక్కులను కాపాడుకుంటామని వ్యాఖ్య
- ప్రభుత్వం స్పందించట్లేదని ఆవేదన
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాయపూడి వద్ద కృష్ణా నదిలోకి దిగి రాజధాని మహిళలు, రైతులు జలదీక్షకు దిగారు. జై ఆంధ్రప్రదేశ్, సేవ్ రాజధాని అంటూ నినాదాలు చేస్తున్నారు.
శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ ఫొటో పట్టుకుని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. 42 రోజులుగా తాము నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వంలో కదలిక లేకపోవడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని పోరాటాలు చేసైనా తాము హక్కులను కాపాడుకుంటామని చెప్పారు. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అన్నారు.