Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' వచ్చే సంక్రాంతికి వెళ్లే ఛాన్స్?
- షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
- ముందుగా ప్రకటించిన విడుదల తేదీ జూలై 30
- సంక్రాంతికి వాయిదా పడినట్టుగా టాక్
అపజయమెరుగని దర్శకుడిగా రాజమౌళి తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. 'బాహుబలి 2' తరువాత ఆయన నుంచి రానున్న 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టు చాలాకాలం క్రితమే చెప్పారు.
అయితే మధ్యలో ఎదురైన కొన్ని అవాంతరాల వలన, షూటింగ్ విషయంలో జాప్యం జరిగింది. ఆ కారణంగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయవచ్చనే టాక్ వినిపించింది. అయితే, అప్పుడు కూడా ఈ సినిమా థియేటర్స్ కి రాకపోవచ్చనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని దసరాకి విడుదల చేస్తే వర్కౌట్ కాకపోవచ్చని నిర్మాతలు భావిస్తున్నారట.
అంతేకాదు, ఆ దిశగా పనులను పూర్తి చేయడం కూడా కష్టమేననే అభిప్రాయానికి వచ్చారట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడమే అన్ని విధాలుగా మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అధికారిక ప్రకటనతోనే ఈ విషయంపై ఒక స్పష్టత వస్తుంది.