Sensex: కేంద్ర బడ్జెట్ పై ఆశలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- ఆర్థిక మంత్రి ప్రకటనతో బలపడ్డ ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- రెండు రోజుల నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్లు
- 232 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. రెండు రోజుల నష్టాలకు తెరదించుతూ మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. రానున్న కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 232 పాయింట్లు లాభపడి 41,199కి చేరుకుంది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 12,130 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (5.10%), నెస్లే ఇండియా (2.95%), ఐటీసీ (2.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.65%), ఇన్ఫోసిస్ (1.56%).
టాప్ లూజర్స్:
టీసీఎస్ (-1.38%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.05%), టైటాన్ కంపెనీ (-0.95%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.84%), సన్ ఫార్మా (-0.56%).