Gold: నేడు మరింతగా పెరిగిన బంగారం ధర!
- రూ. 200కు పైగా పెరిగిన పది గ్రాముల ధర
- రూ. 40,599కి చేరిక
- రూ. 46 వేలకు చేరువైన కిలో వెండి
ఈ మధ్య కాలంలో కొంత స్థిరంగా ఉన్న బంగారం ధరలు గురువారం నాడు మళ్లీ పెరిగాయి`. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక మందగమనం, కరోనా వైరస్ వ్యాప్తి, తదితర కారణాలతో బులియన్ మార్కెట్ తమ పెట్టుబడులకు సురక్షితమని భావిస్తున్న ఇన్వెస్టర్లు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ ఉదయం ఎంసీఎక్స్ (మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్)లో పది గ్రాముల బంగారం ధర రూ. 209 పెరిగి, రూ. 40,559కి చేరింది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ. 367 పెరిగి రూ. 45,918కి చేరింది. భవిష్యత్తులో బంగారం ధరలు మరింతగా పెరుగుతాయని బులియన్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు.