CAA: సీఏఏపై ఓటింగ్ విషయంలో వెనక్కి తగ్గిన యూరోపియన్ యూనియన్
- సీఏఏ ని వ్యతిరేకిస్తూ తీర్మానం తేవాలనుకున్న ఈయూ
- ఇది మా అంతర్గత వ్యవహారమన్న భారత్
- ఫలించిన భారత్ దౌత్యం
కేంద్ర ప్రభుత్వం తీసుకుచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తీర్మానం తీసుకువచ్చే విషయంలో యూరోపియన్ యూనియన్ (ఈయూ) వెనక్కి తగ్గింది. సీఏఏ తీర్మానంపై ఓటింగ్ నిర్వహించే అంశాన్ని ఈయూ రద్దు చేసింది. సీఏఏ ద్వారా భారత్ లో ముస్లింలపై వివక్ష ప్రదర్శితమవుతుందని ఈయూలోని కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే సీఏఏ భారత అంతర్గత వ్యవహారమని, దీంట్లో అంతర్జాతీయ జోక్యానికి ఆస్కారం లేదని భారత్ దౌత్యపరమైన గొంతుక వినిపించింది. చట్టపరమైన ప్రక్రియల అనంతరమే సీఏఏ తీసుకువచ్చామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈయూ తన నిర్ణయాన్ని పక్కనబెట్టడం భారత్ కు లభించిన దౌత్య విజయంగా పేర్కొనవచ్చు.