GO NO.13: ఏపీ ప్రభుత్వానికి మరో షాక్.. జీవో 13ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్!
- కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవో 13
- ఈ జీవో చట్ట విరుద్ధమంటూ పిటిషన్
- హైకోర్టులో పిటిషన్ వేసిన అమరావతి రైతులు
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. రాజధాని అమరావతికి సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో ఉండగానే మరో పిటిషన్ కొత్తగా దాఖలైంది. కర్నూలుకు కార్యాలయాల తరలింపునకు సంబంధించిన జీవో నెం.13ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రైతుల తరఫు న్యాయవాది కర్మంచి మణి ఇంద్రానిల్ బాబు దాఖలు చేశారు. ప్రభుత్వంతో పాటు సీఆర్డీఏను, సీఆర్డీఏ చైర్మన్ ను ప్రతివాదులుగా చేర్చినట్టు, దీనిపై రేపు విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఏపీ విజిలెన్స్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ చైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీస్ సభ్యుల కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జీవో నెం.13 ఇటీవల విడుదలైంది.