Team India: కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలు.. భారీ స్కోరు దిశగా భారత్
- హామిల్టన్ లో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్
- 59 పరుగులతో దూకుడుగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్
హామిల్టన్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. అంతకు ముందు టాస్ గెలిచిన కివీస్ జట్టు భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఇన్నింగ్స్ ను పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఆరంభించారు. అయితే వీరిద్దరూ భారీ స్కోరును సాధించడంలో విఫలమయ్యారు. జట్టు స్కోరు 50 పరుగుల వద్ద షా (20 రన్స్, 21 బాల్స్) వికెట్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత్ స్కోర్ 54 పరుగుల వద్ద మయాంక్ అగర్వాల్ (32 రన్స్, 31 బాల్స్) ఔట్ అయ్యాడు.
వన్ డౌన్ లో బరిలోకి దిగిన కోహ్లీ 51 పరుగులు చేసి సోధీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (59), కేఎల్ రాహుల్ (25) ఉన్నారు. భారత స్కోరు 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు. టీమిండియా ఇదే దూకుడును కొనసాగిస్తే స్కోరు 300 పరుగులు దాటే అవకాశం ఉంది.