Pawan Kalyan: ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా: పవన్ కల్యాణ్

  • రైతుల ఆందోళనలకు యాభై రోజులు పూర్తయ్యాయి
  • రైతులు, ఆడపడచుల స్ఫూర్తికి తెలుగు వాళ్లు గర్విస్తున్నారు
  • రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు

రాజధాని అమరావతిని తరలించవద్దంటూ రైతులు, ఆడపడచులు నిరాహారదీక్షలు, ఆందోళనలు మొదలుపెట్టి యాభై రోజులు పూర్తయ్యాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు, ఆడపడుచుల సడలని ఉద్యమ స్ఫూర్తి, వారు అనుసరిస్తున్న శాంతియుత పంథా చూసి తెలుగువాళ్లు గర్విస్తున్నారని తెలిపారు. రోడ్డునపడ్డ రైతులకు అండగా ఉంటానని గతంలోనే మాటిచ్చానని, ఈ నెల 10 తర్వాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలలా వినిపించేలా నినదిస్తానని, రైతుల ఉద్యమానికి మరోసారి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News