Jagan: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ
- వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని జగన్ పిటిషన్
- కౌంటర్ దాఖలుకు మరింత గడువు కోరిన సీబీఐ
- తదుపరి విచారణ ఈ నెల 12కు వాయిదా
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందేనని సీబీఐ న్యాయస్థానం తేల్చి చెప్పడంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడానికి గడువు కావాలని సీబీఐ కోరడంతో విచారణను నేటికి వాయిదా వేసింది. దీనిపై ఈ రోజు వాదనలు జరిగాయి.
అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ అధికారులు మరింత గడువును కోరారు. దీంతో జగన్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 12కు వాయిదా వేసింది. అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కావాలని కోరుతూ జగన్ ఈ పిటిషన్ వేశారు.