Sensex: రెపో రేటును మార్చని ఆర్బీఐ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 163 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 49 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- నాలుగున్నర శాతం లాభపడ్డ ఇండస్ ఇండ్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లోనే పయనించాయి. రెపో రేటును మార్చకుండా 5.15 శాతం వద్దే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 163 పాయింట్లు లాభపడి 41,306కి పెరిగింది. నిఫ్టీ 49 పాయింట్లు పుంజుకుని 12,138 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.49%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.55%), బజాజ్ ఫైనాన్స్ (3.06%), భారతి ఎయిర్ టెల్ (2.46%), హీరో మోటో కార్ప్ (1.85%).
టాప్ లూజర్స్:
టైటాన్ కంపెనీ (-1.66%), ఇన్ఫోసిస్ (-1.59%), ఐటీసీ (-1.41%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.93%), టీసీఎస్ (-0.80%).